హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాలింత మృతి.. ఆసుపత్రి ఎదుట ఆందోళన

కోనసీమ: కొత్తపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో బాలింత బీర బేబీ (36) మృతి చెందడం ఆందోళనకు దారితీసింది. రెండో కాన్పు కోసం చేరిన బేబీకి శనివారం ఆపరేషన్ చేయగా ఆడబిడ్డ జన్మించింది. ఆదివారం అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో రావులపాలెం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి చెందిందని బంధువులు ఆసుపత్రి వద్ద ధర్నా చేశారు.