KDP: కమలాపురం మండలం ఎర్రగుడిపాడులో దళితులను ఆలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్న వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. శనివారం ఆలయంలోకి వెళ్లవద్దంటూ అడ్డుకున్నారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఆలయంలోకి వెళ్లొద్దన్న వ్యక్తిపై కేసు


