హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంత్రి నేటి పర్యటన వివరాలు

AKP: విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సోమవారం అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు అచ్యుతాపురం రాంబిల్లి మండలంలో 220/132/33 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్‌ను ఆయన ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు విశాఖలోని విద్యుత్ కార్పొరేట్ కార్యాలయంలో కారుణ్య నియామక పత్రాల పంపిణీతో పాటు శాఖాపరమైన సమీక్ష నిర్వహిస్తారని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.