BPT: చీరాల-వాడరేవు ప్రధాన రహదారిపై వాకావారిపాలెం సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులు రోడ్డుపైకి వచ్చిన ఎద్దులను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వాకావారిపాలెం వద్ద రోడ్డు ప్రమాదం


