ELR: ఏలూరు మండలం పాండురంగాపురంలో పురుగు మందు తాగి విజయవాడకు చెందిన పంజాబీ లక్ష్మణ్ (35) చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఏలూరు 2వ టౌన్ హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు వివరాల మేరకు.. కుటుంబ విభేదాల నేపథ్యంలో అక్టోబర్ 2న లక్ష్మణ్, అతని భార్య పురుగు మందు తాగారు. అస్వస్థతకు గురైన వారిని ఆసుపత్రికి తరలించగా లక్ష్మణ్ వైద్యం పొందుతూ మృతి చెందినట్లు ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పురుగు మందు తాగి యువకుడి సూసైడ్


