SRPT: అండర్- 17 బాలికల రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు ఉమ్మడి నల్గొండ జిల్లా జట్టుకు.. కోదాడ క్రికెట్ అకాడమీ క్రీడాకారిణి వర్షిణి ఎంపికైంది. కోదాడ మండలం గుడిబండకు చెందిన వర్షిణి ఆదివారం మిర్యాలగూడలో జరిగిన సెలక్షన్స్ లో జిల్లా తరఫున పాల్గొని అద్భుత బౌలింగ్ తో ఆకట్టుకుంది. ఈ నెల 10 నుంచి 13 వరకు రాజన్న సిరిసిల్లలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో వర్షిని పాల్గొననుంది.
తెలంగాణ
రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు కోదాడ క్రీడాకారిణి ఎంపిక


