GNTR: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఇవాళ జిల్లా, మండల స్థాయిల్లోని అన్ని కార్యాలయాల్లో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సీ.యం.సాయికాంత్ వర్మ తెలిపారు. ప్రజలు తమ అర్జీలను 'మీకోసం వెబ్‌సైట్' లో సమర్పించవచ్చని, పీజీఆర్ఎస్ టోల్ ఫ్రీ నంబర్ 1100కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు. ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు జిల్లాలో పీజీఆర్‌ఎస్ కార్యక్రమం


