హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వాగులో స్నానానికి దిగి యువకుడు మృతి

E.G: రాజానగరం మండలం భూపాలపట్నం చెందిన పంతం సూర్య భగవాన్ (28) ఆదివారం రంపచోడవరం లోని సీతపల్లి వాగులో మృత్యువాత పడ్డాడు. కొరియర్ సంస్థలో పనిచేస్తున్న ఈ యువకుడు వచ్చేవారం అయ్యప్ప మాల వేసుకునే తరుణంలో మిత్రులతో కలిసి సరదాగా ఏజెన్సీ టూర్‌కు వెళ్లాడు. అక్కడే సీతపల్లి వాగులో మిత్రులంతా స్నానానికి దిగారు. వాగు ప్రవాహానికి సూర్య భగవాన్ కోట్టుకుపోయి మృతి చెందాడు.