E.G: రాజమండ్రి రైల్వే స్టేషన్ పరిధిలో రైలు నుంచి జారిపడి సుమారు 45 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి ఆదివారం మృతి చెందినట్లు జీఆర్పీ ఎస్సా ఎం. వెంకటేశ్వరరావు తెలిపారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 99086 22211 నంబర్ను సంప్రదించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి


