హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

4,500 కిలోల బియ్యం పట్టివేత

GNTR: తాడేపల్లి మండలం వడ్డేశ్వరం వద్ద ఆదివారం రాత్రి విజిలెన్స్‌, సివిల్‌ సప్లయ్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. విజయవాడ నుంచి గుంటూరుకు తరలిస్తున్న 90 బస్తాల పీడీఎస్‌ బియ్యాన్ని పట్టుకున్నారు. 4,500 కిలోల బియ్యంతో పాటు టాటా ఇంట్రా వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అక్రమ రవాణాపై కేసు నమోదు చేశారు.