హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నేడు తృప్తి కాంటీన్ ప్రారంభం'

VSP: అగనంపూడి కూడలిలో ఏర్పాటు చేసిన తృప్తి క్యాంటీన్ ఇవాళ ఉదయం 10 గంటల నుంచి అందుబాటులోకి రానుంది. ప్రజలకు తక్కువ ధరకు రుచికరమైన ఆహారం అందించేందుకు దీన్ని ఏర్పాటు చేశారు. కంటెయినర్‌ను సిద్ధం చేసి అన్ని మౌలిక వసతులు సమకూర్చారు. క్యాంటీన్‌ను ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రారంభిస్తారని జీవీఎంసీ అధికారులు తెలిపారు.