హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు పద్మనాభ ఆలయంలో వరుణ యాగం

VSP: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పద్మనాభంలోని శ్రీఅనంత పద్మనాభస్వామి ఆలయంలో ఈ నెల 6న వరుణ యాగం నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ ఉదయం 7 గంటలకు వరుణ జపం, 9.30 గంటలకు వరుణ యాగం, అనంతరం 10.30 గంటలకు పార్వతీ నారాయణేశ్వర స్వామి ఆలయంలో సహస్రాభిషేకం నిర్వహించనున్నట్లు వారు పేర్కొన్నారు.