హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పుట్టపర్తి డీఎస్పీగా మాణిక్యరావు నియామకం

SS: పుట్టపర్తి ఉప విభాగానికి (సబ్ డివిజన్) నూతన డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా మాణిక్యరావు నియమితులయ్యారు. త్వరలోనే ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. సబ్ డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజలకు పోలీసు సేవలను సమర్థవంతంగా అందించడమే తమ ప్రాధాన్యత అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.