హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేకాట స్థావరంపై పోలీసుల దాడి

SRCL: సిరిసిల్ల పెద్దూరులో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. నగదు పందెంగా పెట్టి పేకాట ఆడుతున్న వారిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ కె.నాగేంద్రచారి తెలిపారు. నిందితుల నుంచి రూ.12,720 నగదు, 52 పేకముక్కలు, ఏడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇంటి యజమాని జూపేల్లి పాపారావుపై కేసు నమోదు చేశారు.