హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేత్రదానానికి ముందుకొచ్చిన తల్లి

VSP: కొడుకు మృతి బాధలోనూ నేత్రదానానికి ఒప్పుకున్న తల్లి ఆదర్శంగా నిలిచింది. పెందుర్తి మండలం సుందర్‌నగర్‌కు చెందిన అరవింద్ (28) రైల్వే ఉద్యోగి మృతి చెందాడు. మృతదేహం తరలింపునకు కుటుంబం సాయి ట్రస్ట్ అధ్యక్షుడు దాడి శ్రీనును ఆశ్రయించగా నేత్రదానంపై అవగాహన కల్పించారు. తల్లి స్వరూప అంగీకారంతో ఎల్వీ ప్రసాద్ బృందం కార్నియా సేకరించింది.