హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రస్థాయి U-17 క్రికెట్ జట్టుకు ధర్మవరం యువతి

SS: అనంతపురం RDT మైదానంలో జరిగిన ఎస్‌జీఎఫ్ U-17 జిల్లా స్థాయి ఎంపికల్లో ధర్మవరానికి చెందిన ముత్యాల చైత్ర ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి క్రికెట్ జట్టుకు ఎంపికైంది. ధర్మవరం మున్సిపాలిటీ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి రాజేంద్రప్రసాద్ కుమార్తె అయిన చైత్ర, ప్రస్తుతం RDT ఏడీసీఏ క్యాంపులో శిక్షణ పొందుతోంది. రాష్ట్రస్థాయికి ఎంపికైన చైత్రను పలువురు అభినందించారు.