హైదరాబాద్: 28°C
తెలంగాణ

కోటిలింగాల ఆలయ అభివృద్ధి పనులకు మార్కింగ్

JGL: 2027 గోదావరి పుష్కరాల నేపథ్యంలో వెల్గటూర్ మండలం కోటిలింగాల శ్రీ కోటేశ్వర స్వామి ఆలయం వద్ద చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆదివారం మార్కింగ్ చేశారు. దేవాదాయ శాఖ సీఈ దుర్గాప్రసాద్, ఈఈ రాజేష్, ఏఈ సంతోష్, ఆర్కిటెక్చర్ కన్సల్టెన్సీ ప్రతినిధులు పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఈవో కాంతారెడ్డి, ఆలయ ఛైర్మన్ పి. రమేష్, గ్రామ సర్పంచ్ కోటయ్య, అర్చకులు ఉన్నారు.