హైదరాబాద్: 28°C
తెలంగాణ

దలిత మహిళ పై దాడి

BHNG: చింతపల్లి మండలం పీకే మల్లెపల్లి గ్రామంలో గ్రామసభ సందర్భంగా దళిత మహిళ వీఓఏ గనిపల్లి మాధవిపై జరిగిన దాడిని మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు ఖండించారు. గ్రామసభ సందర్భంగా మాధవిని అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడికి పాల్పడిన ఘటనపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు స్పందించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.