KMM: ఎర్రుపాలెం మండలంలో ఆదివారం బీటీ రోడ్ల నిర్మాణ పనులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. ఎర్రుపాలెం నుంచి జయంతి, రామాపురం నుంచి కొత్తపాలెం వరకు నిర్మించనున్న రోడ్ల పనులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ రహదారుల నిర్మాణంతో ఆయా గ్రామాల ప్రజలకు రాకపోకలు మెరుగుపడనున్నాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ
బీటీ రోడ్లకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన


