హైదరాబాద్: 28°C
తెలంగాణ

దసరా వేళ.. మేకపోతుల ధరలకు రెక్కలు!

MLG: సద్దుల బతుకమ్మ, దసరా పండుగల సందడి ములుగు జిల్లా మార్కెట్లలో కనిపిస్తోంది. ఆదివారం ఉదయం నుంచే మేకపోతులు, గొర్రెపోతుల కొనుగోళ్లు జోరందుకున్నాయి. ప్రస్తుతం 12 కిలోల మేకపోతు ధర సుమారు రూ.16 వేలు, గొర్రెపోతు ధర రూ.13 వేల వరకు పలుకుతోంది. పండుగకు డిమాండ్ పెరగడంతో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు.