హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎకో ఫ్రెండ్లీ గణనాథుడికి నేడు నిమజ్జనం

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డ గిరిజన భవన్‌లో ఏర్పాటు చేసిన ఎకో ఫ్రెండ్లీ గణనాథుడికి నేడు నిమజ్జనం నిర్వహించనున్నారు. ప్రత్యేకంగా ఇక్కడ వినాయకుడిని 21 రోజుల పాటు ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 21 రోజులపాటు ఇక్కడ పూజలు నిర్వహిస్తామని నిర్వాహకులు రవి రాథోడ్ వెల్లడించారు.