హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ కోతలపై రైతుల నిరసన

MDK: శివ్వంపేట మండలం గుండ్లపల్లిలో విద్యుత్ కోతలను నిరసిస్తూ రైతులు ఆదివారం సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. సరైన సరఫరా లేక బోరు మోటార్లు కాలిపోతున్నాయని, పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే గ్రామంలో ఇళ్లపై నుంచి ఉన్న 11కేవీ లైన్‌తో ఇటీవల ఒకరు మృతి చెందినా, ఆ లైన్ తొలగించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు.