హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ ఇంటింటి ప్రచారం

NLG: అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేయస్) మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ చిట్యాల మండలం పిట్టంపల్లిలో ప్రజా సంఘాల నాయకులు ఆదివారం ప్రచారం నిర్వహించారు. నవంబర్ 15న నల్లగొండలో జరిగే రైతు బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు జిట్ట నగేష్, శ్రీను, కత్తుల లింగస్వామి, నర్సింహా, పరమేష్, గోపాల్, వెంకన్న, సత్తయ్య, యాదయ్య పాల్గొన్నారు.