SRPT: చివ్వెంల మండలం రోళ్లబండ తండా సమీపంలోని ఎస్‌ఆర్‌పీటీ–కేఎంఎం జాతీయ రహదారిపై మినీ డీసీఎం అదుపుతప్పి బోల్తాపడింది. అతివేగంగా వెళ్తున్న వాహనం అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. వాహనం దెబ్బతిన్నప్పటికీ ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు. సమాచారం అందుకున్న రహదారి భద్రతా సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
తెలంగాణ
అదుపుతప్పి బోల్తాపడ్డ మినీ డీసీఎం


