హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రైతు పొలానికి గడ్డి మందు.. పంట ధ్వంసం

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం జగదేవ్‌పేటలో రైతు బద్దం మాధవరెడ్డి కొనుగోలు చేసిన సర్వే నంబర్ 135లోని 16 గుంటల వ్యవసాయ భూమిలో వరి పంట సాగు చేశారు. పంట చేతికొచ్చే సమయంలో గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు పొలంలోకి ప్రవేశించి గడ్డి మందు పిచికారీ చేసినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయిందని రైతు తెలిపారు. 50 వేల నష్టం వాటిల్లిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.