హైదరాబాద్: 28°C
తెలంగాణ

మానవత్వం చాటిన సూర్యాపేట కౌన్సిలర్లు..

SRPT : మానవత్వానికి రాజకీయాలు అడ్డురావు అని సూర్యాపేట మున్సిపల్ కౌన్సిలర్లు మరోసారి చాటిచెప్పారు. ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన 20వ వార్డు కౌన్సిలర్ చెంచల మణిలత భర్త, మాజీ కౌన్సిలర్ చెంచల శ్రీనివాస్ కుటుంబానికి వారు పార్టీలకతీతంగా అండగా నిలిచారు. కౌన్సిలర్లంతా కలిసి తమ ఒక నెల గౌరవ వేతనం కింద రూ. 2,40,000/- ఆర్థిక సహాయాన్ని ఆ కుటుంబానికి అందజేశారు.