హైదరాబాద్: 28°C
తెలంగాణ

సిలిండర్ ధరలను తగ్గించాలి: CITU

BDK: వాణిజ్య సిలిండర్‌పై కేంద్ర ప్రభుత్వం రూ. 69 రూపాయలు పెంచడం అంటే సామాన్యులపై అదనపు మోయలేని భారమేనని సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ అన్నారు. ఆదివారం దమ్మపేటలో పెరిగిన వాణిజ్య సిలిండర్ ధరలను తగ్గించాలని కోరుతూ మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పెంచిన సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.