హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాన్సువాడలో తీవ్రమైన కోతులు, కుక్కల బెడద

KMR: పట్టణంలో కుక్కలు, కోతులు గుంపులు గుంపులుగా తిరుగుతూ స్వైరవిహారం చేస్తున్నాయి. ప్రతిరోజూ చిన్నారులపై, పెద్దలపై దాడులు చేస్తుండటంతో పట్టణ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కోతులు ఇళ్లల్లోకి చొరబడి తినుబండారాలు ఎత్తుకుపోతున్నాయని, రోజురోజుకూ వాటి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోందని వాపోతున్నారు. తక్షణమే స్పందించి ఈ కోతులు, కుక్కల బెడదను నివారించాలని ప్రజలు కోరుతున్నారు.