హైదరాబాద్: 28°C
తెలంగాణ

డిచ్‌పల్లిలో ఘనంగా ఊర పండుగ!

NZB: డిచ్‌పల్లి మండలం ఖిల్లా డిచ్‌పల్లి గ్రామంలో ఆదివారం గ్రామ ప్రజలందరూ కలిసి ఊర పండుగను ఘనంగా నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు బాగా పండాలని, అంటువ్యాధులు ప్రబలకుండా గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.