హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సింగీతం శ్రీనివాసరావు సేవలు అజరామరం'

JGL: ప్రముఖ సినీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు సేవలు అజరామరమని కళాశ్రీ అధినేత గుండేటి రాజు అన్నారు. ఆదివారం జగిత్యాల దేవిశ్రీ గార్డెన్స్‌లో జగిత్యాల షార్ట్‌ఫిలిం ఇండస్ట్రీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంతాప సభలో సింగీతం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించారు. యూట్యూబ్ దర్శకుడు గడ్డం రాజారామ్ మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.