హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళల భద్రతపై షీ టీమ్‌ అవగాహన

WGL: వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ ఉమెన్స్‌ హాస్టల్‌లో షీ టీమ్‌ ఆధ్వర్యంలో మహిళల భద్రత, సైబర్‌ నేరాలు, టీ-సేఫ్‌ యాప్‌పై ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించారు. షీ టీమ్‌ ఎస్సై రామారావు పాల్గొని సోషల్‌ మీడియాలో వ్యక్తిగత ఫొటోలు, వివరాలను పంచుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. టీ-సేఫ్‌ యాప్‌ను వినియోగించుకోవాలని తెలిపారు.