BDK: సింగరేణి ఉద్యోగులకు రూ.1,10,250 పర్ఫామెన్స్ లింక్డ్ రివార్డ్ బోనస్ అందనుంది. ఇటీవల సింగరేణి ప్రధాన కార్యాలయంలో జరిగిన అపెక్స్ జేసీసీ సమావేశంలో యాజమాన్యం,కేంద్ర కార్మిక సంఘాల మధ్య దీనిపై ఒప్పందం జరిగింది. గతేడాదితో పోలిస్తే బోనస్ రూ.7,250 పెరిగింది. ఈ బోనస్‌ను దీపావళికి ముందు ఉద్యోగులకు చెల్లించనున్నారు. ఈ నిర్ణయంపై కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
సింగరేణి ఉద్యోగులకు గుడ్ న్యూస్...!


