లింగంపేట్ మండలం పోతాయిపల్లికి చెందిన సావిత్రికి ఆదివారం పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 సిబ్బందికి సమాచారం అందించారు. ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో నొప్పులు అధికం కావడంతో ఈఎంటీ అనిల్, పైలెట్ రోహిత్ చాకచక్యంగా వ్యవహరించి అంబులెన్సులోనే సుఖ ప్రసవం చేశారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్లు 108 సిబ్బంది తెలిపారు.
తెలంగాణ
108 అంబులెన్స్‌లో మహిళ సుఖ ప్రసవం


