ADB: గాదిగూడ మండలంలోని పర్సవాడ(బి) గ్రామానికి చెందిన కనక జనాబాయి ఆదివారం అనారోగ్యంతో మృతిచెందింది. ఆమె భర్త వ్యవసాయ కూలీగా కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వారికి ఓ కుమార్తె ఉండగా.. స్థానిక సర్పంచ్ రాథోడ్ కళ్యాణి సిసెందర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఆర్థిక సహాయం అందజేసి.. కుమార్తె చదువుల కోసం అండగా ఉంటూ కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసానిచ్చారు.
తెలంగాణ
'బాధిత కుటుంబానికి అండగా ఉంటాం'


