RR: శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో పుణె నుంచి వస్తున్న ఇండిగో 6E352 విమానాన్ని పక్షి ఢీకొట్టింది. ఈ ఘటనలో విమానం ముందు భాగం స్వల్పంగా దెబ్బతింది. కుదుపులతో ప్రయాణికులు ఆందోళనకు గురైనా, పైలట్ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడంతో ఊపిరిపీల్చుకున్నారు. టెక్నీషియన్లు తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో చండీగఢ్ వెళ్లాల్సిన తదుపరి సర్వీసును రద్దు చేశారు.
తెలంగాణ
శంషాబాద్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం


