KMR: చించోల్లిలో పురుగుల పోచమ్మ పండుగను గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ బసోల్లా శ్రీనివాస్, ఉపసర్పంచ్ శేఖర్ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, యువకులు, పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పంటలను పురుగులు, తెగుళ్ల బారిన పడకుండా కాపాడి, మంచి దిగుబడులు వచ్చేలా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని గ్రామస్థులు ప్రార్థించారు.
తెలంగాణ
చించోల్లిలో పురుగుల పోచమ్మ పండుగ


