హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రైతులకు సాగునీరు అందించాలి'

JN: స్టేషన్ ఘనపూర్ రిజర్వాయర్ నుండి 3LR కాలువ ద్వారా రైతులకు సాగునీరు అందించాలని బీజేపీ జాఫర్ ఘడ్ మండల అధ్యక్షుడు నగేష్ గౌడ్ కోరారు. తిమ్మంపేటలో కాలువలను బీజేపీ మండల అధ్యక్షుడు సందర్శించారు. ఎల్ నినో నేపథ్యంలో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రైతుల పంటల సాగుకు సరిపడా నీటిని అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. రైతుల విషయంలో నిర్లక్ష్యం వహించోద్దని అన్నారు.