హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిస్తాం'

NRML: ఆర్టీసీ కార్మికులకు సంపూర్ణ ఉద్యోగ భద్రత కల్పిస్తూ ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మాజీ కేంద్ర మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి తెలిపారు. నిర్మల్‌లో కార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశమైన ఆయన, ఇతర రాష్ట్రాల అనుభవాలను పరిశీలించి తెలంగాణలో కార్మికులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.