JGL: శంకరపట్నం మండలం కొత్తగట్టు-గొల్లపల్లి గ్రామస్తులు కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారిపై శాంతియుత నిరసనకు దిగారు. జాతీయ రహదారి విస్తరణ పనులతో డ్రైనేజీ వ్యవస్థ ఎత్తు పెరగడం, రెండు గ్రామాలకు యూటర్న్ లేకపోవడంతో శాంతియుతంగా ధర్నా చేస్తున్నట్లు రెండు గ్రామాల ప్రజలు తెలిపారు. అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చేవరకు రహదారిపై నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున చేపడతామన్నారు.
తెలంగాణ
శాంతియుత నిరసనకు దిగిన రెండు గ్రామాల ప్రజలు


