హైదరాబాద్: 28°C
తెలంగాణ

'జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి'

ADB: ఎల్‌నినో ప్రభావంతో పంటలు పండక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలువురు రాజకీయ నేతలు పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం సీపీఎం కార్యాలయంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి జోగు రామన్న, సీపీఎం నేత బండి దత్తాత్రి, బీజేపీ నాయకురాలు పాల్గొన్నారు.