హైదరాబాద్: 28°C
తెలంగాణ

సంగారెడ్డిలో సినీ నటి అనసూయ సందడి

సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీలో సినీ నటి అనసూయ సందడి చేశారు. పట్టణంలోని ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనసూయను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆమెతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఉత్సాహం చూపడంతో షాపింగ్ మాల్ పరిసరాల్లో సందడి నెలకొంది.