PDPL: రామగిరి మండలం సుందిళ్ల గ్రామానికి చెందిన శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ ఛైర్మన్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కొరకొప్పుల సత్యనారాయణ మృతి చెందారు. ఆదివారం సుందిళ్లలో జరిగిన అంత్యక్రియల్లో మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొని పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మృతి కాంగ్రెస్ పార్టీకి, గ్రామానికి తీరని లోటని పేర్కొన్నారు.
తెలంగాణ
సత్యనారాయణకు కాంగ్రెస్ నాయకుల నివాళులు


