హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపటి నుంచి బార్లు బంద్....!

BDK: రాష్ట్రవ్యాప్తంగా అన్ని బార్ అండ్ రెస్టారెంట్లు మూసివేయనున్నట్లు రాష్ట్ర బార్ అండ్ రెస్టారెంట్స్ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది. బార్ల లైసెన్స్ నిబంధనలు, ఫీజుల పెంపు పేరుతో ఆర్థిక భారం మోపుతున్న ప్రభుత్వ వైఖరికి నిరసనగా అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో రూ.40లక్షలుగా ఉన్న లైసెన్స్ ఫీజును రూ.44 లక్షలకు పెంచి భారం మోపుతున్నారని మండిపడింది.