W.G: భీమవరం కలెక్టరేట్ సహా జిల్లాలోని అన్ని మండల కార్యాలయాల్లో రేపు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ప్రజలు తమ అర్జీలు ఇవ్వవచ్చన్నారు. కలెక్టరేట్‌కు రాకుండానే 1100 టోల్ ఫ్రీ నంబర్ లేదా ఆన్‌లైైన్ ద్వారా కూడా సులభంగా ఫిర్యాదులు చేయవచ్చని ఆమె సూచించారు.
ఆంధ్రప్రదేశ్
రేపు యథావిధిగా 'PGRS' కార్యక్రమం: కలెక్టర్


