W.G: మొగల్తూరు మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం పేరుపాలెం బీచ్‌కు ఆదివారం జిల్లా నలుమూలల నుంచి పర్యాటకులు భారీగా తరలివచ్చారు. సెలవుదినం కావడంతో ఉదయాన్నే కుటుంబాలతో సహా బీచు చేరుకొని సందడి చేశారు. సముద్ర స్నానాలు చేస్తూ ఇసుక తిన్నెలపై ఆడుకుంటూ ఆహ్లాదంగా గడిపారు. అనంతరం తీర ప్రాంతంలోని ఆలయాలను సందర్శించి భక్తులు ప్రత్యేక దర్శనాలు చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
పేరుపాలెం బీచ్‌లో పర్యాటకుల సందడి


