హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాధితులకు సీఎం సహాయనిధి చెక్కు అందజేత

AKP: పాటిపల్లికి చెందిన గనిరెడ్డి సత్యవతి, సత్యనారాయణ దంపతులకు రూ.65 వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఇవాళ అందజేశారు. ఏపీ ఆర్డీసీ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే పప్పల చలపతిరావు చేతుల మీదుగా ఈ పంపిణీ జరిగింది. ఆపదలో ఉన్న పేదలకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని వారు తెలిపారు. కార్యక్రమంలో పలువురు స్థానిక నేతలు పాల్గొన్నారు.