హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గురజాలలో ఆర్టీసీ సిబ్బందిపై దాడి

PLD: గురజాలలో ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌పై దాడి జరిగింది. మాచర్ల ఎక్స్‌ప్రెస్ బస్సును అడ్డరోడ్డు వద్ద కాస్త ముందుగా ఆపారన్న కోపంతో ఓ మహిళ, ఆమె కుటుంబ సభ్యులు బైకులను అడ్డుపెట్టారు. తిరుగు ప్రయాణంలో ఉన్న బస్సుపై రాళ్లు రువ్వి, సిబ్బందిపై గుడ్లు, కర్రలతో దాడి చేశారు. కండక్టర్ సోమయ్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.