హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అస్తవ్యస్తంగా కాలువలు.. చెరువులకు అందని నీరు

KDP: ఖాజీపేట మండలంలోని రావులపల్లి, దుంపలగట్టు, చెన్నముక్కపల్లి గ్రామాల్లో చెరువులకు నీరందించే కాలువలు అధ్వాన్నంగా మారాయి. కేసీ కెనాల్ కొండపేట ఉపకాలువల ద్వారా రావులపల్లి చెరువుకు నీరు చేరాల్సి ఉన్నా.. కాలువల దుస్థితితో చెరువు పూర్తిస్థాయిలో నిండడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువలకు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.