హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు సీతారాముల శాంతి కళ్యాణం

NTR: నందిగామ పాతకూర గాయాల మార్కెట్ సమీపంలోని సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో ఆదివారం రాత్రి 7 గంటలకు శాంతి కళ్యాణం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఛైర్మన్ మహంకాళి వెంకన్న తెలిపారు. ప్రతి నెల పునర్వసు నక్షత్రం రోజున స్వామివారి కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆలయ కమిటీ కోరింది.