NDL: రాష్ట్రంలో జడ్జిల పదవీ విరమణ వయసును 61 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసినట్లు మంత్రి ఫరూఖ్ తెలిపారు. ఈ ఏడాది మార్చి 31 నుంచే ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని ఆదివారం నంద్యాలలో పేర్కొన్నారు. 2024 నవంబర్‌లో రిటైర్మెంట్ వయసును 60 నుంచి 61 ఏళ్లకు పెంచినట్లు తెలిపారు. 62 ఏళ్లకు పెంచాలని సుప్రీంకోర్టు పలు రాష్ట్రాలను ఆదేశించినట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
జడ్జిల పదవీ విరమణ వయసు పెంపు: మంత్రి


